పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు
జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి మాట్లాడారు. జిల్లాలోని 385 గ్రామ పంచాయతీలలోని 3536 వార్డుల్లో ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో 607263 మంది ఓటర్లు ఉన్నారని, 3 విడతలలో ఎన్నికలను నిర్వహిస్తామన్నారు.