యూపీలో అరుదైన శస్త్ర చికిత్స
UPలో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. పుట్టుకతోనే నడుము భాగంలో తోకలాంటి భాగం పెరుగుతూ వస్తోంది. దాని వల్ల కదిలినా, ఏదైనా తగిలినా నొప్పితో బాధ పడుతున్న చిన్నారిని తల్లిదండ్రులు ఎన్ని ఆసుపత్రులు తిప్పినా ఫలితం లేకపోయింది. చివరకు బలరాంపూర్ వైద్యులు ఆ చిన్నారికి పరీక్షలు చేసి విజయవంతంగా ఆ తోకను తొలగించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉంది.