ద్విచక్ర వాహనం బోల్తా.. ఇద్దరికీ గాయాలు

ద్విచక్ర వాహనం బోల్తా.. ఇద్దరికీ గాయాలు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మాపూర్, సముద్ర లింగాపూర్ మధ్యగల కెనాల్ బ్రిడ్జి వద్ద రోడ్డుపై ఏర్పడ్డ గుంతల కారణంగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రకి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.