ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ

BHPL: విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ సూచించారు. చెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండొద్దన్నారు. అలాగే వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కరెంటు వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని కరెంటు స్థంభాలు, ట్రాన్సాపార్మర్స్ ముట్టుకోవద్దని కోరారు.