మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలి

మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలి

PPM: జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగుపడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు ఆ పార్టీ ఓబీసీ జిల్లా ఛైర్మన్ వంగల దాలి నాయుడు మంగళవారం జిల్లా ఆస్పత్రి నూతన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన జి.నాగ శివ జ్యోతిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలకు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని కోరారు.