జంగారెడ్డిగూడెంలో ఉపాధ్యాయుల క్రీడా పోటీలు
ELR: జంగారెడ్డిగూడెంలో ఉత్సాహంగా జరిగిన డివిజన్ స్థాయి ఉపాధ్యాయ క్రీడా పోటీలు శుక్రవారం ముగిశాయి. మహిళల త్రోబాల్ విభాగంలో జంగారెడ్డిగూడెం జట్టు సత్తా చాటి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. పురుషుల క్రికెట్ పోటీల్లో బుట్టాయిగూడెం జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు ఎంఈవోలు బహుమతులు అందజేసి ప్రశంసించారు.