ప్రమాదకరంగా మ్యాన్ హోల్.. ఫిర్యాదు పట్టించుకోట్లే..!
MDCL: ఉప్పల్ శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్-1 వద్ద మ్యాన్ హోల్ ప్రమాదకరంగా ఉందని, పలుమార్లు వార్తా కథనాలు వచ్చాయని, అనేక సార్లు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ అధికారులు స్పందించడం లేదని, రాత్రి సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. వెంటనే ప్రమాదకరంగా ఉన్న మ్యాన్ హోల్స్ మొత్తం మరమ్మతులు చేపట్టాలని శ్రీనగర్ కాలనీ ప్రజలు డిమాండ్ చేశారు.