VIDEO: శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం మూసివేత
శ్రీకాకుళం పట్టణం అరసవెల్లిలో వెలసిన శ్రీసూర్యనారాయణ స్వామి దేవస్థానం మంగళవారం మూసి వేయడం జరిగింది. చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు ఉదయం 9:30 గంటలకు మూసి వేయడం జరిగిందని ఆలయ అర్చకులు శంకర్ శర్మ తెలిపారు. మళ్లీ బుధవారం ఉదయం 6 గంటలకు తెరవడం జరుగుతుందన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. జిల్లాలో ఉన్న అన్ని దేవాలయాలు మూసి వేయడం జరిగిందన్నారు.