బాధితుడి బాబాయి చెవి కొరికిన నిందితుడు
NGKL: లింగాల మండలం అవుసలికుంట గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఒకరు గాయపడ్డారు. బాధితుడు శివ తన కుమార్తెను చెంపదెబ్బ కొట్టిన విషయంపై ప్రశ్నించగా, గ్రామానికి చెందిన లాజర్, పరమేశ్, అలివేలు కలిసి అతనిపై ఇనుప రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. మరోసారి వివాదం చోటుచేసుకోగా, నిందితుడు వెంకటయ్య బాధితుడి బాబాయి చెవిని కొరకగా చెవి కొంత భాగం ఉడిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు.