సీఎం సహాయ నిధి పేదలకు వరం: ఎమ్మెల్యే

సీఎం సహాయ నిధి పేదలకు వరం: ఎమ్మెల్యే

WG: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. సోమవారం భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో 56 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి రూ.27,77,339 చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఇప్పటివరకు 39వ విడతలో 693 మంది లబ్ధిదారులకు రూ.5,39,62,516లను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.