గౌనిపల్లిలో 104 సేవలు

గౌనిపల్లిలో 104 సేవలు

సత్యసాయి: ఓబులదేవరచెరువు మండలం గౌనిపల్లి గ్రామంలో శుక్రవారం ఇంటింటికీ 104 సేవలు నిర్వహించారు. డాక్టర్ కమల్ రోహిత్, MLHP వసుంధర, ఆరోగ్య కార్యకర్త లక్ష్మి దేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోగులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు.