'560 ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేశారు'
TG: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీస్ శాఖ నిర్వహించిన 'ఏక్తా దివాస్' కార్యక్రమానికి చిరంజీవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్ కూడా పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. '560 ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసిన గొప్ప వ్యక్తి పటేల్. ఆయన దృఢ సంకల్పం, విజన్ ఆదర్శనీయం. HYDలో పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉంది' అని అన్నారు.