కుట్టు మిషన్ల శిక్షణ పేరిట భారీ కుంభకోణం: వైసీపీ

KKD: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ పేరిట రూ. 230 కోట్లు కుంభకోణానికి తెరతీసిందని వైసీపీ నాయకుడు ఆవాల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు సామర్లకోట వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.