చెరువు అలుగును పరిశీలించిన ఎస్పీ

SRD: కొండాపూర్ మండలం తేర్పోల్‌ను జిల్లా SP పరతోష్ పంకజ్ ఇవాళ సందర్శించారు. స్థానిక చెరువు అలుగు పరిసరాలను పరిశీలించారు. ఇక్కడ ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన సూచించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రోడ్డుపై పారుతున్న వాగులను దాటొద్దన్నారు. ఆయన వెంట కొండాపూర్ సీఐ సుమన్, ఎస్సై సోమేశ్వరి, MRO, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.