ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృతి

VZM: గంట్యాడ మండలంలోని మదనాపురం జంక్షన్ నుండి గ్రామంలోకి ఆదివారం వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడటంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మదనాపురానికి చెందిన వర్రి రామారావు (45) అక్కడికక్కడే మృతి చెందాడు. గంట్యాడ ఎస్సై సాయికృష్ణ సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు.