భీంపూర్ పీహెచ్సీని సందర్శించిన జిల్లా వైద్యాధికారి

భీంపూర్ పీహెచ్సీని సందర్శించిన జిల్లా వైద్యాధికారి

ADB: భీంపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి వైసీ శ్రీనివాస్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా రోగులను కలిసి అందుతున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలోని రికార్డు, రిపోర్టులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డా.నిఖిల్ రాజ్, విస్తీర్ణాధికారి జ్ఞానేశ్వర్, తదితరులున్నారు.