సీపీఐ ఆధ్వర్యంలో తీవ్రవాద దిష్టిబొమ్మ దగ్ధం
నాగర్‌కర్నూల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో తీవ్రవాద దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి ఫయాజ్ మాట్లాడుతూ.. ఢిల్లీ నగరంలో జరిగిన తీవ్రవాదుల ముష్కరులదాడి పిరికిపందచర్య అని అన్నారు. నిత్యం రద్దీతో ఉండే ఎర్రకోట సమీప ప్రాంతాలలోకి పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి అనే దానిపై కేంద్రప్రభుత్వ హోంశాఖ సమాధానం చెప్పాలన్నారు.