VIDEO: మరో ట్రావెల్ బస్సుకు ప్రమాదం

VIDEO: మరో ట్రావెల్ బస్సుకు ప్రమాదం

కడపకు చెందిన హరిత ట్రావెల్స్ బస్సు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. బెంగళూరు వెళ్తుండగా ఆంధ్ర - కర్ణాటక బార్డర్‌‌లోని మంచినీళ్లకోట వద్ద బస్సు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందాగా, పది మందికి గాయాలు కావడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు ప్రొద్దుటూరుకు చెందిన అనితగా గుర్తించారు. కాగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.