'పాఠశాలలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు'

ప్రకాశం: కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గురువారం ఎస్సై వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్ అమరవీరుల శాఖ ఫలాలను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.