జేఎన్టీయూ మార్గంలో ట్రాఫిక్ జామ్..!

మేడ్చల్: KPHB ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ROB నుంచి జేఎన్టీయూ యూనివర్సిటీ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. దీని కారణంగా వాహనాలు మెల్లగా కదులుతున్నాయని, ట్రాఫిక్ తగ్గించడం కోసం ట్రాఫిక్ పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.