పునరావాస కేంద్రంలో విద్యుత్ సౌకర్యం

ELR: వరద బాధితుల పునరావాస కేంద్రంలో విద్యుత్ సౌకర్యం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ సాల్మన్ రాజు తెలిపారు. శుక్రవారం దాచారంలోని పునరావాస కేంద్రాన్ని విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు ఆహార పదార్ధాలు తయారుచేసే వంటశాలకు, పునరావాస కేంద్రంలో విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు.