వైసీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఇందుకూరి
కోనసీమ: వైసీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా రాజోలు నియోజకవర్గానికి చెందిన ఇందుకూరి సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తనకు ఉత్తర్వులు అందాయని ఆయన గురువారం తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.