VIDEO: 'పర్యాటకులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలి'
NGKL: కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల నుంచి సంగమేశ్వరం వెళ్లే పర్యాటకులకు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ పలు సూచనలు చేశారు. ఇవాళ సర్పంచ్ వెంకటలక్ష్మితో కలిసి ఆయన బోట్లను పరిశీలించారు. పర్యాటకులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే బోట్ల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.