'ప్రచార సమయాల్లో నిబంధనలు పాటించాలి'

'ప్రచార సమయాల్లో నిబంధనలు పాటించాలి'

ASF: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచార సమయాల్లో నిబంధనలు పాటించాలని వాంకిడి MRO కవిత బుధవారం సూచించారు. అభ్యర్థులు తమ ప్రచార వాహనాలకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మైకును ఉపయోగించుకోవచ్చన్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు మైకు లేకుండా ప్రచారం చేసుకోవచ్చని తెలిపారు. ఈ నిబంధనలు అతిక్రమించిన వారు చట్టపరంగా శిక్షార్హులు అవుతారన్నారు.