అమెరికాలో కెనడా విలీనమైతే గోల్డెన్ డోమ్ ఫ్రీ: ట్రంప్

తమ దేశంలో 51వ రాష్ట్రంగా కెనడా చేరాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇటీవల అమెరికా రక్షణ నిమిత్తం గోల్డెన్ డోమ్‌ను తీసుకొస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో చేరేందుకు కెనడా ఆసక్తి కనబరించింది. దీనిపై స్పందిస్తూ అమెరికాలో విలీనమైతే కెనడాకు ఉచితంగానే రక్షణ లభిస్తుందని, లేకపోతే 61 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.