ఆసీస్ మీడియా మనసు దోచిన జెమీమా
WWCలో భాగంగా ఆస్ట్రేలియాపై భారత మహిళల జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, సాధారణంగా ఆస్ట్రేలియా ఓడిపోతే ప్రత్యర్థి ఆటగాళ్లపై అక్కసు వెళ్లగక్కే ఆ దేశ మీడియా జెమీమా రోడ్రిగ్స్‌పై ప్రశంసలు కురిపించాయి. 'స్టన్నింగ్ ఇన్నింగ్స్. అద్భుతమైన లక్ష్య ఛేదన' అని ఏబీసీ న్యూస్ కామెంట్ చేసింది. 'భారత్ అద్భుతమైన రన్ ఛేజింగ్ చేసింది' అని ఫాక్స్ క్రికెట్ పోస్టు పెట్టింది.