బేగంబజార్ నుంచి నాంపల్లి వరకు భారీ ర్యాలీ
HYD: భగవాన్ మహావీర్ 2625వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని జైన భక్తులు భారీగా తరలివచ్చారు. బేగంబజార్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. శ్రీ జైన్ సేవా సంఘ్ నిర్వాహకుల అంచనా ప్రకారం 20,000 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా మహిళల బైక్ ర్యాలీ, ఒంటెలు సవారీ నిలిచాయి.