సీజ్ చేసిన ఇసుక బహిరంగ వేలం

సీజ్ చేసిన ఇసుక బహిరంగ వేలం

KNR: శంకరపట్నం తహసీల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలో అక్రమంగా తరలిస్తూ సీజ్ చేసిన ఐదు ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను వేలం వేయనున్నట్లు తహసీల్దార్ కే. సురేఖ తెలిపారు. హుజూరాబాద్ అదనపు న్యాయ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈనెల 16న మధ్యాహ్నం 3 గంటలకు వేలం నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు పాల్గొనాలని కోరారు.