రేపు భీమవరంలో మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్
W.G: భీమవరం మున్సిపల్ కార్యాలయంలో రేపు నిర్వహించనున్న మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్ గోడపత్రికను జేసీ రాహుల్ ఆవిష్కరించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ డ్రైవ్‌ను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని, వివిధ కంపెనీలు పాల్గొనే ఈ కార్యక్రమంలో అర్హత గల అభ్యర్థులు హాజరవ్వాలని కోరారు.