ఆగిరిపల్లి లో రైతన్న మీకోసం

ఆగిరిపల్లి లో రైతన్న మీకోసం

ELR: ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెంలో బుధవారం 'రైతన్న మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే విశాఖలో సీఐఐ సదస్సు నిర్వహించినట్లు చెప్పారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.