నేడు NIMSలో FREE క్యాన్సర్ స్క్రీనింగ్
HYD: పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో నేడు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు వైద్య యంత్రాంగం వెల్లడించింది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తారు. గుట్కా, పాన్ మసాలా, పొగాకు అలవాటు ఉన్నవారు, 30 నుంచి 60 ఏళ్ల వయసు మధ్య ఉన్న మహిళలకు రొమ్ము పరీక్షలు, గర్భాశయ ముఖద్వారా స్క్రీనింగ్ సైతం చేయనున్నారు.