తిరుపతిలో 24న జాబ్ మేళా
TPT: ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్(MCC)లో 24న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. మొత్తం 6 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. దాదాపు 1350 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.