VIDEO: వర్షానికి తడిచిన 3 ఎకరాల ధాన్యం
PPM: కురుపాం మండలం సప్పగొత్తిలి సమీపంలో 3 ఎకరాల వరి చేను కోసామని రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ధాన్యం మొత్తం తడిచిపోయిందని రైతు ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తడకుండా రాత్రి నుండి టార్పానులు చేతితో పట్టుకుని కాపలా కాస్తున్నామని ధాన్యాన్ని బస్తాల్లో నింపి తరలిస్తున్నామన్నారు. తమని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.