ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు
PDPL: ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెచ్చరించారు. కమాన్ పూర్మండలం రొంపికుంట గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎం. తిరుపతిని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసినందుకు విధుల నుంచి తొలగించారు. ప్రభుత్వ పథకాల అమలులో అవినీతి సహించబోదని, సాయం సహించేది లేదని హెచ్చరించారు.