VIDEO: మండలంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం
SKLM: ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో గురువారం ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం బీసీ సెల్ పార్లమెంటరీ జనరల్ సెక్రెటర గాలి వెంకటరెడ్డి. ఆయన మాట్లాడుతూ.. వలసల నివారణకు ఉపాధి హామీ పనులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి చిన్నారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ కొత్త రమణ, ఉపాధి వేతన దారులు ఉన్నారు.