VIDEO: వేపచెట్టు నుంచి పాలధార
సత్యసాయి: పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలో ఓ వేపచెట్టు నుంచి పాలు కారుతున్న అరుదైన దృశ్యం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా వేప చెట్టు నుంచి పాల లాంటి ద్రవం కారడానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణమని వృక్ష శాస్త్ర నిపుణులు Hit TVకి తెలియజేశారు.