రాష్ట్రంలోనే తొలిసారి ఒంగోలులో షూటింగ్ టోర్నమెంట్
ప్రకాశం జిల్లా ఓ అద్భుత క్రీడకు వేదిక కానుంది. రాష్ట్రంలోనే తొలిసారి షూటింగ్ టోర్నమెంట్ ఒంగోలులో నిర్వహించేందుకు విద్యా శాఖ సిద్ధమవుతోంది. ఈనెల 7, 8, 9న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో షూటింగ్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. 700మంది క్రీడాకారులు తరలి వస్తారని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. టోర్నీ గురించి కలెక్టర్ రాజాబాబుతో డీఈఓ చర్చించారు.