చిత్తూరులో 47 మందికి జరిమానా: సీఐ

CTR: ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న 47 మందికి పోలీసులు జరిమానా విధించారు. చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర తన సిబ్బందితో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పలుచోట్ల అత్యంత వేగంతో ద్విచక్రవాహనాలు నడుపుతూ పాదచారులను ఇబ్బందులకు గురిచేసిన వారిని గుర్తించారు. ఇలా 47 మందిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చామని వన్ టౌన్ సీఐ తెలిపారు .