బీర్పూర్ పంచాయతీలు ఏకగ్రీవం: ఎమ్మెల్యే

బీర్పూర్ పంచాయతీలు ఏకగ్రీవం: ఎమ్మెల్యే

జగిత్యాల రూరల్ మండలంలోని చర్లపల్లి, బీర్పూర్ మండలంలోని గుండుగూడెం గ్రామపంచాయతీలలో నూతన పాలకవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు గురువారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను క్యాంపు కార్యాలయంలో కలిసి శాలువాతో సత్కారం అందుకున్నారు. కేడీసీసీ జిల్లా మెంబర్ రామచందర్ రావు, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.