ఎండపల్లిలో నూతన ప్రెస్ క్లబ్ ప్రారంభం

KNR: ఎండపల్లి మండల కేంద్రంలో బుధవారం నూతన ప్రెస్ క్లబ్ ప్రారంభమైంది. టీడబ్ల్యూజేఎఫ్ కౌన్సిల్ సభ్యులు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులుగా ఎలక భగవాన్, అధ్యక్షులుగా గౌరీ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా బండి శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటామని అన్నారు.