శివాలయంకు చేరిన వరద నీరు

శివాలయంకు చేరిన వరద నీరు

కృష్ణా: ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా విడుదలవుతున్న వరద నీరు కంకిపాడు మండలం కాసరనేనివారిపాలెం శివాలయం వరకు చేరింది. వరద ఉధృతికి ఆలయం చుట్టుపక్కల నీరు చేరడంతో భక్తులు లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంకా వరద నీరు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.