వెంకటగిరి విద్యార్థినుల నిజాయితీపై లోకేష్ ప్రశంసలు
TPT: వెంకటగిరి జడ్పీ పాఠశాల విద్యార్థినుల నిజాయితీని మెచ్చుకుంటూ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు. "ఒక అన్నగా మీ నిజాయితీ చూసి గర్విస్తున్నాను" అంటూ సదరు విద్యార్థులను ప్రశంసించారు. కాగా, బంగారం, నగదుతో కూడిన పర్సు దొరకగా వెంకటగిరికి చెందిన విద్యార్థులు పోలీసులకు అందజేసిని విషయం తెలిసిందే.