జాతీయ స్థాయి రగ్బీ క్రీడలకు హర్షవర్ధన్ ఎంపిక
MHBD: గూడూరు మండలం అయోధ్య పురం ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ జాతీయ స్థాయి రగ్బీ క్రీడలకు ఎంపికయ్యాడు. డోర్నకల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థి, ఈనెల 8, 9, 10వ తేదీలలో భువనేశ్వర్‌లో జరిగే జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.