గిల్ కోసం త్యాగం చేసేదెవరు?

ఆసియా కప్ టోర్నీ కోసం ప్రకటించిన భారత జట్టులో శుభ్‌మన్ గిల్ చోటు దక్కించుకున్నాడు. వైస్ కెప్టెన్సీ కూడా సెలక్టర్లు కట్టబెట్టారు. దీంతో అతడు తుది జట్టులో తప్పకుండా ఉంటాడు. అయితే టాపార్డర్‌లో అభిషేక్ లేదా శాంసన్ లేదా తిలక్ వర్మ తుది జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉంది. సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ స్థానాలు పదిలంగా ఉండనున్నాయి.