మృతురాలికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

NTR: నందిగామ పట్టణం మార్చరీ నందు సోమవారం మధ్యాహ్నం అబ్బూరి మాధవి పార్థివదేహాన్ని కూటమి నేతలతో కలిసి ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. అనంతరం ఆమె మృతికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె వెంట పట్టణ, కూటమి నేతలు పాల్గొన్నారు.