సిర్పూర్‌(టి)లో సౌర బ్యాటరీ దొంగతనం

సిర్పూర్‌(టి)లో సౌర బ్యాటరీ దొంగతనం

ASF: జిల్లాలోని సిర్పూర్ (టి) మండల కేంద్రంలో ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ప్లాంటేషన్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన సౌర బ్యాటరీని దొంగిలించిన ఘటనపై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మోహన్ రావు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి డాగ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం దుబ్బగూడ, నవేగాం గ్రామాల వైపు దొంగలు వెళ్లినట్లు గుర్తించింది.