కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే
BDK: ఇల్లందు మండలం కొమరారం గ్రామపంచాయతీలో నేడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తారాచంద్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడు లేని విధంగా గ్రామ ప్రజానికం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటున్నారని ఎమ్మెల్యే కోరం తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.