20 అడుగులకు చేరిన పోచారం ప్రాజెక్ట్

MDK: మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో గల పోచారం ప్రాజెక్టు నీటిమట్టం గురువారం 20 అడుగులకు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, లింగంపేట, గాంధారి నుంచి వస్తున్న వాగులు పారడంతో ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. ఓవర్ ఫ్లో కావడానికి మరో అర అడుగు దూరంలో ఉంది. 20.5 అడుగుల నీరు వస్తే ప్రాజెక్టు ఓవర్ ఫ్లో కానుంది.