Z.P.H స్కూల్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

Z.P.H స్కూల్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పామర్రు(మం) అడ్డడాలో ఉన్న Z.P.H స్కూల్‌ను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, విద్యాస్థాయి తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా భోజనంలో నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.