VIDEO: 'అండర్ టన్నెల్ పనులు ప్రారంభించాలి'
KMM: సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన అండర్ టన్నెల్ పనులు ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ఆదివారం కారేపల్లి మండలం చీమలపాడు గుట్టల వద్ద జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ ఆయకట్టు రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని, అందుకే పనుల్లో వేగం పెంచాలని కోరారు.